కరోనాపై పోరాటానికి విక్కీ కోటి విరాళం

ఇప్పుడు యావత్‌ ప్రపంచమంతా చిన్నపెద్దా అని తేడా లేకుండా తమకు తోచినంత సాయాన్ని కరోనా వైరస్‌కి బాధితుల కోసం విరాళాలు ఇస్తున్నారు. ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ నటుడు విక్కీ కౌశల్‌ తన వంతుగా పీఎమ్‌-కేర్స్, సీఎమ్‌ రిలీఫ్‌ పండ్‌కి కోటి రూపాయలను విరాళం ఇచ్చారు. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో..‘‘నాలాగా ఇంట్లో కూర్చొని తినే వసతిలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో, నేను వినయంగా పీఎమ్‌-కేర్స్, మహారాష్ట్ర ముఖ్యమంతి రిలీప్‌ ఫండ్‌కి కోటి రూపాయలు ఇస్తున్నా. మనందరము కలిసికట్టుగా ఈ కోరోనా వైరస్‌ మహమ్మారిపై గెలుస్తాం. మనందరం ఆరోగ్యంగా ఉండి, భవిష్యత్తుకోసం కృషి చేద్దాం. జైహింద్‌’’అంటూ పేర్కొన్నాడు. వీక్కీతో పాటు చాలామంది నటీనటులు తమవంతు విరాళాలు ఇచ్చారు. అక్షయ్‌ కుమార్‌ 25 కోట్లు ఇచ్చారు. అనుష్క శర్మ, శిల్పాశెట్టి, కత్రీనా కైఫ్‌ పీఎమ్‌-కేర్స్‌ ఫండ్‌కి తమవంతు సాయాన్ని అందించారు. ప్రస్తుతం విక్కీ కౌశల్, సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో ‘సర్దార్‌ ఉద్ధమ్‌ సింగ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. రైజింగ్‌ సన్‌ ఫిల్మ్స్, కినో వర్క్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమాకి అజయ్‌-అతుల్‌ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vicky Kaushal (@vickykaushal09) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.