‘విక్రమ్‌ వేద’ రీమేక్‌లో ఈ ఇద్దరూ?

తమిళనాట బ్లాక్‌బ్లస్టర్‌ అయిన సినిమా ‘విక్రమ్‌ వేద’. వైవిధ్యభరితమైన కథనంతో తెరకెక్కిన ఈ మూవీలో మాధవన్, విజయ్‌సేతుపతి నటించారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి తీసుకెళుతున్నారు. ఇందులో ఇద్దరు ఖాన్స్‌ నటించనున్నట్లు సమాచారం. 18 సంవత్సరాల క్రితం ‘దిల్‌ చాహ్తా హై’తో చిత్రంలో వెండి తెరపై కలసి కనిపించారు అమీర్‌ ఖాన్, సైఫ్‌ అలీ ఖాన్‌. ఇప్పుడు మళ్ళీ ‘విక్రమ్‌ వేద’తో ఈ కాంబినేషన్‌ను తెరపై చూసే అవకాశం ఉంది అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. 2020లో ఈ సినిమాను సెట్్సపైకి తీసుకెళ్లనున్నారు. వీలైనంత త్వరగా చిత్రనిర్మాణం పూర్తి చేసి 2020లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.