నేను ఆ ట్వీట్‌ను తొలగించాను

బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌పై చేసిన ట్వీట్‌ను సినీ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తొలగించారు. ఐశ్వర్యారాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోలుస్తూ సోమవారం వివేక్‌ ట్వీట్‌ చేసిన ఫొటోపై తీవ్ర దుమారం రేగింది. వివేక్‌ ఇంత నీచానికి దిగజారుతారని అనుకోలేదంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్‌ వివేక్‌పై కేసు నమోదు చేసింది.‘‘ ్ఞఒక్కోసారి కొన్ని విషయాలు చూడగానే మనకు ఫన్నీగా అనిపిస్తాయి. కానీ కొందరికి అలా అనిపించకపోవచ్చు. గత పదేళ్లలో నేను దాదాపు రెండు వేల మందికి పైగా పేద ఆడపిల్లల సంరక్షణ బాధ్యత తీసుకున్నాను. అలాంటిది నేను ఓ మహిళ పట్ల ఇంత నీచానికి దిగజారాను అనడం ఊహించలేను. ఎవరో క్రియేట్‌ చేసిన ఓ ఫొటోకు నేను సరదాగా రిప్లై ఇవ్వడం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఆ ట్వీట్‌ను తొలగించేశాన్ఠు అని ఆయన ఇచ్చిన మరోట్వీట్‌లో రాశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.