ముఖ్యమంత్రిగా అభిషేక్‌!

‘అభిషేక్‌ బచ్చన్‌ అవినీతి పరుడైన రాజకీయ నేతగా మారబోతున్నారా?’.. అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ‘దస్వి’ చిత్రం కోసం అభిషేక్‌ ఈ కొత్త అవతారమెత్తనున్నట్లు సమాచారం. దినేష్‌ విజన్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రమిది. యామి గౌతమ్, నిమ్రత్‌ కౌర్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో అభిషేక్‌ ఓ నిరక్షరాస్యుడైన అవినీతి ముఖ్యమంత్రిగా దర్శనమివ్వబోతున్నారట. సినిమాలో ఆయన కనిపించే విధానం.. ఆయన పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా చాలా కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ప్రస్తుతం అభిషేక్‌ నటించిన ‘ది బిగ్‌ బుల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.