అభిషేక్‌ ‘బాబ్‌ బిస్వాస్‌’ ప్రారంభం!

హీరోయిజం ఉంటేనే పాత్రలు చేస్తాననే రకం కాదు బిగ్‌ బి తనయుడు అభిషేక్‌ బచ్చన్‌. తనకు నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేస్తాడు అభిషేక్‌. తాజాగా అభిషేక్‌ ‘బాబ్‌ బిస్వాస్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. బౌండ్‌ పిక్చర్స్‌ సమర్పణలో, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఫోటో ఒకనొకదాన్ని అభిషేక్‌ తన ట్విట్టర్లో ఫోస్ట్‌ చేశాడు. ఆ ఫోటోకి..‘‘లైట్స్‌..కెమెరా..నమస్కార్‌..షూట్‌ డే వన్‌..’’ అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించాడు. అన్నట్టు ఆ ఫోటోలో క్లాప్‌ కొడుతుండగా దాని వెనుకాల తల కొద్దిగా కిందికి దించకున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఆ పాత్ర వయసు కూడా బోల్డ్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అభిషేక్‌ తన తండ్రితో కలిసి ‘పా2’, మరో చిత్రం అనురాగ్‌ బసు దర్శకత్వంలో వస్తోన్న ‘లుడో’లోను నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.