మూడు దశాబ్దాలు...వంద చిత్రాలు

త్తరాది అగ్ర కథానాయకుడు అజయ్‌దేవ్‌గణ్‌ నట ప్రస్తానానికి మూడు దశాబ్దాలు. ఇప్పుడు ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘తన్హాజీ ది అన్సంగ్‌ వారియర్‌’తో వందో చిత్ర మైలురాయిని అందుకున్నాడు. ఈ మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన సినిమాలు చేయని జోనర్‌ లేదు. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, క్రైమ్‌ ఇలా ప్రతి జోనర్‌లో విభిన్నమైన చిత్రాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా వందో చిత్ర మైలురాయిని అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్‌ ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘‘నా స్నేహితుడు నుంచి నేను మరో 100 చిత్రాల కోసం ఎదరుచూస్తున్నారు’’ అని రాసుకొచ్చాడు. వరుణ్‌ ధావన్, కాజోల్‌ మరి కొందరు ప్రముఖులు కూడా అజయ్‌ దేవగణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో ఇదే ట్రెండింగ్‌ నడుస్తుంది. అజయ్‌ దేవగణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.