స్టంట్‌ మాస్టర్‌గా మారిన అజయ్‌ దేవగణ్‌

అజయ్‌ దేవగన్‌ హీరోగా చేస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. అభిషేక్‌ ధుదియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు అజయ్‌ దేవగన్‌ స్టంట్‌ మాస్టర్‌గా మారాడట. లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్ అందుబాటులో లేకపోవడంతో అజయ్‌, సంజయ్‌దత్‌ నటించిన కొన్ని పోరాట సన్నివేశాలకు కొరియోగ్రాఫ్‌ చేశాడు. ఈ సన్నివేశాలు చిత్రంలో కీలకంగా మారనున్నాయట. అవి పాకిస్తాన్‌ గూఢచారులతో పోరాడే సన్నివేశాలట. ఈ సినిమాలో ప్రతినాయకులుగా సంజయ్‌ దత్‌, శరద్‌ కేల్కర్‌ నటిస్తున్నారు. చిత్ర నిర్మాతలైన భూషణ్ కుమార్‌, వజీర్‌ సింగ్‌, కుమార్‌ మంగత్‌ పాఠక్‌ల కోరిక మేరకే స్టంట్ మాస్టర్‌గా అజయ్‌ బాధ్యతలను తీసుకున్నాడట. చిత్రంలో అజయ్‌ దేవగన్‌ స్వ్కాడన్‌ లీడర్‌ విజయ్‌ కర్నిక్‌ పాత్రలో నటిస్తున్నారు. చిత్రం కథ అంతా 1971నాటి ఇండో-పాక్‌స్తాన్‌ యుద్ధ నేపథ్యంలో నడవనుంది. సినిమాలో సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, అమి విర్క్, ప్రణితా సుభాష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.