అజయ్‌ దేవగణ్‌ మైదాన్‌ 16 ఎకరాల సెట్ కూల్చివేత


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. సినిమా ఇప్పటికే షూటింగ్‌ కొంతభాగం పూర్తి చేసుకొంది. చిత్రం కోసం ముంబైలో 16 ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను వేశారు. అయితే కరోనా వైరస్ వల్ల ఈసెట్ ఉపయోగపడలేదు. వర్షకాలం వచ్చేసరికి సెట్‌ని కూల్చేయాలన్ని నిర్మాణ సంస్థ నిర్ణయించారు. సెట్‌ని కూల్చివేస్తున్నట్లు వచ్చిన వార్తలను చిత్రనిర్మాత బోనీకపూర్‌ కూడా ధృవీకరించారు. ఇంత భారీ సెట్‌ని నిర్మించాలంటే కనీసం రెండునెలల సమయం అయినా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన సన్నివేశాలను కోల్‌కత్తా, లక్నో చిత్రీకరించారు. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అబ్దుల్‌ సయీద్‌ రహీం జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాకి అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కథంతా 1952 నుంచి 1962లో ఫుట్‌బాల్‌కి స్వర్ణయుగంగా చెప్పుకునే కాలంలోనే ఉండనుంది. ఇందులో ప్రియమణి, గిరిజ రావు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 11న విడుదల కావాల్సి ఉంది. అంతేకాదు కరోనా వైరస్‌ వల్ల చాలా సినిమాల షూటింగ్‌లతో పాటు సెట్స్ కూడా పనికిరాకుండా పోయాయి. మరో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నచారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ ‌ సెట్స్ కూడా కూల్చివేయనున్నారట. నిర్వహణ వ్యయం పెరుగుతుండంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారట. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.