గాల్వన్‌ వ్యాలీ నేపథ్యంలో అజయ్‌ దేవగన్‌ చిత్రం!

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ మల్టీస్టారర్‌ చిత్రాలతో పాటు దేశభక్తితో కూడిన చిత్రాల్లో నటిస్తూ ఉంటారు. తాజాగా ఆయన గాల్వన్‌ వ్యాలీ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 16న మన సైనికులు చైనా సైనికులతో తలపడి వీరమరణం పొందారు. కమాండింగ్‌ అధికారి కల్నల్‌ సంతోష్‌బాబుతో సహా 20 మంది సైనికులు చైనా కుతంత్రాలకు ఎదరునిలిచి పోరాడి ప్రాణాలు కోల్పోయారు. గాల్వన్‌ వ్యాలీ నేపథ్యంలో అజయ దేవగన్‌ ఫిల్మ్స్, సెలక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అజయ్‌ దేవగన్‌ గతంలో ‘ఎల్‌ఓసీ: కార్గిల్‌’, ‘ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌’, ‘తాన్హాజీ’,లాంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో స్వ్కాడన్‌ లీడర్‌ విజయ్‌ కర్నిక్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం అంతా 1971నాటి ఇండో-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంతో నడవనుంది. అభిషేక్‌ ధుదియా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో సోనాక్షి సిన్హా, నోరా ఫతేహీ, అమి విర్క్, ప్రణితా సుభాష్‌లు నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.