జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న బచ్చన్‌ పాండే చిత్రం

బాలీవుడ్‌ చిత్రీసీమలో చాలా స్పీడుగా సినిమాలు తీసే కథానాయకుడిగా అక్షయ్‌ కుమార్‌కి పేరుంది. దానికి తగ్గట్టే ఆయన వచ్చే ఏడాది జనవరిలో ‘బచ్చన్‌ పాండే’ చిత్రం షూటింగ్‌ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్షయ్ కుమార్‌, కృతి సనన్‌ కలిసి నటించనున్న చిత్రం ‘బచ్చన్‌ పాండే’. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వంలో నదియాద్వాలా గ్రాండ్‌ సన్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రంలో మరో కథానాయికగా కూడా నటించనుంది. ‘బచ్చన్‌ పాండే’ చిత్రం 2014లో తమిళంలో విడుదలైన ‘వీరమ్’‌ చిత్రానికి ఇది రీమేక్‌. ఇందులో అజిత్‌, తమన్నాలు జంటగా నటించి మెప్పించారు. అక్షయ్‌ మొదట ఈ చిత్రానికి ‘ల్యాండ్‌ ఆఫ్‌ లుంగి’ అనే పేరును పెట్టారు. తిరిగి ఆ పేరును ‘బచ్చన్‌ పాండే’గా మార్చారట. అన్ని సక్రమంగా జరిగివుంటే ఈ ఏడాది క్రిస్మమస్‌ పండక్కి తెరమీదకు వచ్చేది. కరోనా వైరస్‌ కారణంగా పరిస్థితులు తలకిందులైయ్యాయి. అక్షయ్‌ కుమార్‌ - క్రితి ససన్‌ గత ఏడాది ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రంలో సందడి చేశారు. వచ్చే ఏడాది జనవరిలోనే ‘బచ్చన్‌ పాండే’ చిత్ర షూటింగ్‌ జైసల్మేర్లో ప్రారంభం కానుంది. చిత్రంలో అక్షయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండగా, క్రితి సనన్‌ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. తెలుగులో మహేష్‌బాబుతో కలిసి ‘1నేనొక్కడినే’ చిత్రంలో కూడా క్రితి ససన్‌ జర్నలిస్టుగా నటించి అలరించింది.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.