రామోజీ ఫిలింసిటీలో హెలీకాప్టర్‌పై అక్షయ్‌ పోరాటాలు

మరో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రను వెండితెరకు తీసుకొచ్చే పనిలో తీరిక లేకుండా ఉన్నారు బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి. ‘సింగం’ సిరీస్‌ చిత్రాలు, ‘సింబా’ తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సూర్యవంశీ’. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడు. కత్రినాకైఫ్‌ నాయిక. అజయ్‌దేవగణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో  చిత్రీకరించారు. హెలికాప్టర్‌ నేపథ్యంగా సాగే పోరాట సన్నివేశాలను అక్షయ్‌పై తెరకెక్కించారు. దాంతో పాటు కార్‌ ఛేజింగ్‌ సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. దీంతో చిత్రీకరణ పూర్తయింది. ‘‘రోహిత్‌శెట్టితో పోలీస్‌ చిత్రానికి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు అక్షయ్‌. 2020 మార్చి 27న విడుదల కానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.