కత్రీనాతో అలీ అబ్బాస్‌ జాఫర్‌ కొత్త చిత్రం!


ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కత్రీనా కైఫ్‌ ప్రధాన పాత్రలో ఓ సూపర్‌ హీరో చిత్రం చేయాలని దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ భావిస్తున్నాడు. ప్రస్తుతం కథానాయికలే ప్రధాన పాత్రల్లో నటించే సమయం ఆసన్నమైందని చెప్తున్నాడు అలీ అబ్బాస్‌. 2017లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’ తరువాత అలీ అబ్బాస్‌ జాఫర్‌ కత్రీనా కోసం కథ రాయడం మొదలెట్టానని ఆ మధ్య ఓ పత్రికతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె కచ్చితంగా యాక్షన్‌ చిత్రాలకు సరిపోయే శారీరక సామర్థ్యం కూడా ఉందని చెబుతున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తూనే ఉంది కత్రీనా. అయితే సినిమా కోసం ఆమె మరింత కఠిటనమైన శిక్షణ పొందవలసిన అవసరం ఎంతైనా ఉందట. త్వరలోనే సినిమాకి సంబంధించిన లోకేషన్లును పరిశీలించడానికి వెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో లోకేషన్లే చిత్రానికి కీలకం కానున్నాయి. కరోనా వైరస్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌,  సడలింపులు, అంతర్జాతీయం రాకపోకలు పరిస్థితిపై సినిమా స్థితిగతులు ఆధారపడి ఉంటాయని అలీ అబ్బాస్‌ జాఫర్‌ చెబుతున్నారు. సినిమా టైటిల్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నాక అధికారికంగా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని అలీ చెప్పారు. ప్రస్తుతం అలీ అబ్బాస్‌ ‘ఖాలీ పీలి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.