హిందీ చిత్రాల్లో హైదరాబాద్‌ అమ్మాయి

ఒక్క హిందీ చిత్రంలో నటిస్తే చాలు అప్పటి వరకు ఉన్న కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోతుంది. జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెడుతుంది. అందుకే నాయికలందరూ టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా ఏదో ఒక పరిశ్రమతో పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్‌ బాట పడుతుంటారు. మరి ఓ నటి పరిచయమే రెండు హిందీ సినిమాలతో అయితే? ఆ సదవకాశమే దక్కించుకుంది హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ యువతి అమ్రిన్‌‌ ఖురేషి. అది కూడా రెండు తెలుగు రీమేక్‌ల్లో. అల్లు అర్జున్‌ కథానాయకుడుగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘జులాయి’, రాజ్‌ తరుణ్‌ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ‘సినిమా చూపిస్త మామ’ హిందీలో రీమేక్‌లు అవుతున్నాయి. ఈ రెండింటిలో కథానాయకుడిగా ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి నటిస్తున్నాడు. నాయికగా అమిన్‌ ఖురేషి ఎంపికైంది. ఏ పాత్రకైనా అమ్రిన్‌‌ అందం తీసుకురాగలదని అంటున్నారు అక్కడి దర్శకనిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లోనూ మరిన్ని అవకాశాలు అందుకోబోతుంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.