ఇర్ఫాన్‌ లేకపోతే ఈ సినిమానే లేదు!

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అంగ్రేజ్‌ మీడియం’. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హోమీ అజ్దానియా మాట్లాడుతూ ‘‘ఇర్ఫాన్‌ కోసం సంవత్సరం నుంచి ఎదురు చూశాను. ఈ పాత్ర కోసం ఇర్ఫాన్‌ తప్ప మరో నటుడిని ఊహించుకోలేము. గత వేసవిలో షూటింగ్‌ మొదలుపెట్టాము. నటన అనేది ఇర్ఫాన్‌ రక్తంలోనే ఉంది. ఇంతకు ముందు ఇలాంటి నటుడితో కలిసి పనిచేయలేదు. సెట్‌లో ఆయన ఎప్పుడూ అలిసిపోయినట్లు చూడలేదు’’ అంటూ చెప్పాడు. ఇక చిత్ర నిర్మాత దినేష్‌ విజ్జన్‌ మాట్లాడుతూ ‘‘నేను, ఇర్ఫాన్‌ - మీరా నాయర్‌ దర్శకత్వంలో ‘ది నేమ్‌సేక్‌’ నుంచి గమనిస్తున్న ఎప్పుడైనా ఇర్ఫాన్‌తో కలిసి పనిచేయాలని. అది ఇప్పటికి నెరవేరింది. ఇక మా దర్శకుడు హోమి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా సంస్థ ప్రారంభంలో వచ్చిన ‘బీయింగ్‌ సైరస్‌’ చిత్రానికి హోమినే దర్శకుడు. ఆ సమయంలోనే అనుకున్నాం మనం అందరం కలిసి ఓ సినిమా చేద్దామని. అది ఇప్పటికీ కుదరింది’’ అని చెప్పాడు. ఇప్పటికే చిత్రానికి ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. మడోక్‌ ఫిల్మ్స్, లండన్‌ కాలింగ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో కరీనా కపూర్, డింపుల్‌ కపాడియా, రాధిక మదన్, దీపక్‌ డొబ్రియల్‌ తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు. సచిన్‌-జిగర్‌లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 13, 2020న ప్రేక్షకుల ముందకు రానుంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.