అత్రాంగి రే కోసం కలిసి పాట పాడిన ధనుష్‌ - రెహమాన్‌

ధనుష్‌, సారా అలీఖాన్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అత్రాంగి రే. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ చిత్రంలో భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్‌.రెహమాన్‌, తను కలిసి ఓ పాట పాడారు. ఇదే విషయాన్ని హీరో ధనుష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. చిత్రానికి సంగీత స్వరాలు కూడా అందిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. లక్నోలో తొలుత షూటింగ్‌ ప్రారంభమైంది. తరువాత లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీ-సీరీస్‌, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్, కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాతీయ అవార్డు గ్రహిత హిమాన్షు రాయ్‌ చిత్రానికి కథను అందించారు. సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.


View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.