కరోనా బారిన అర్జున్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారాయన. ‘‘కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌ అని తేలింది. లక్షలేవీ లేవు. ప్రస్తుతం బావున్నాను. వైద్యుల సలహాలు, సూచనల మేరకు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. మీ అందరికి ఈ విషయం తెలపడం నా బాధ్యత. నా ఆరోగ్య పరిస్థితి మీతో పంచుకుంటుంటాను. మానవత్వంఈ వైరస్‌ని ఓడించగలదని విశ్వసిస్తున్నాన’’ని పేర్కొన్నారు అర్జున్‌ కపూర్‌. బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలువాలని ఆకాంక్షిస్తున్నారు.

View this post on Instagram

🙏🏽

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.