‘దుర్గావతి’ తర్వాత మరో హిందీ చిత్రం!

నాని కథానాయకుడుగా తెరకెక్కించిన ‘పిల్ల జమీందార్‌’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశోక్‌. అనుష్క ప్రధాన పాత్రధారిగా అశోక్‌ తీసిన ‘భాగమతి’ సినిమా మరో మెట్టు ఎక్కించింది. గతంలో తాను తెరకెక్కించిన కథలకి ఇది పూర్తి విభిన్నం. సస్పెన్స్‌ థ్రిల్లగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడిదే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘దుర్గావతి’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారాయన. భూమి పెడ్నేకర్‌ నాయిక. అక్షయ్‌ కుమార్‌, భూషన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 11న విడుదలకు సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగానే మరో హిందీ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారట అశోక్‌. నస్రత్‌ బరూచా, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్‌ కథని తెరకెక్కించనున్నారని బీటౌన్‌లో వినిపిస్తుంది. బాలీవుడ్‌ దర్శకుడు లవ్‌రంజన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని టాక్‌. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.