అక్షయ్‌ బెలబాటమ్‌లో హుమా ఖురేషి?


బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ హీరోగా రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. స్పై థ్ర్లిల్లర్‌గా 1980ల నాటి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, హుమా ఖురేషి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. విష్ణు భగ్నానీ, పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్త సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రానికి మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 80ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ పోలీస్‌ అధికారిగా నటించనున్నాడు. ఈ పాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. కేంద్రరాష్ర్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం సినిమా షూటింగ్‌ అనుమతి ఇచ్చినప్పటికీ ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారట. ఈ చిత్రాన్ని కొంతభాగం స్కాట్‌లాండ్‌లోనూ చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి షూటింగ్‌ జరిపే పరిస్థితి కూడా లేదు. హుమా ఖురేషి అక్షయ్‌ కుమార్‌తో కలిసి గతంలో ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ ఆయన భార్య పుష్పా పాండే పాత్రలో నటించి అలరించింది. ప్రస్తుతం హుమా ఖురేషీ హాలీవుడ్‌ చిత్రం ‘ఆర్మీ ఆఫ్‌ ది డెడ్‌’లో గీతగా నటిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ‘బెల్‌ బాటమ్‌’‌ చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్లేందుకు చిత్రబృందం కసరత్తులు చేస్తుంది. ఈ చిత్రాన్ని 2021 జనవరి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గతంలో ప్రకటించారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందకు వస్తుందో లేదో తెలియదు. 


View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.