‘భారత్‌’ నుంచి ‘స్లో మోషన్‌’గా దింపేశారు..

‘‘ప్రతి చిరునవ్వు ఎవ్వరూ చూడలేని ఓ బాధను దాస్తుంటుంది’’ అంటూ ‘భారత్‌’ ట్రైలర్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించారు సల్మాన్‌ ఖాన్‌. ఇప్పుడు ‘‘స్లో మోషన్‌’’.. అనే పాటతో దిశాతో కలిసి సందడి చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. పాటలో సల్మాన్‌ బైక్‌పై నుంచోని చేసిన విన్యాసాలు.. దిశా పటానీ ఆక్రోబాట్స్‌ చేసే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దిశా డ్యాన్స్‌ పరంగా.. లుక్స్‌ పరంగా సూపర్బ్‌ అనిపించింది. ‘‘భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ.. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ‘భారత్‌’ అనే వ్యక్తి కథగా ఈ చిత్రం ఉండబోతుంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. రంజాన్‌ కానుకగా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.