ఇండో-పాక్ యుద్ధంలో సుందర్‌బెన్‌గా సోనాక్షి

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటిస్తున్న చిత్రం ‘భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ చిత్రంలో సామాజిక కార్యకర్తగా నటిస్తుంది. సినిమాకి సంబంధించిన సోనాక్షి పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్ని చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. కథానాయకుడు అజయ్ ‌దేవగణ్‌ ట్విట్టర్లో ఫస్ట్ లుక్‌  పోస్టర్ని షేర్‌ చేశారు. ‘‘భారత సైన్యానికి మద్దతుగా 299 మంది మహిళలను తనతో పాటు తీసుకెళ్లిన ధైర్యమైన సామాజిక కార్యకర్త సుందర్‌బెన్ జేతా మాధర్‌పర్యగా సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ ఇది. చరిత్ర నుంచి ఒక కీలకమైన సంఘటన త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ప్రేక్షకుల ముందుకు రానుందని’’ పేర్కొన్నారు.  చిత్రం  హైదరాబాద్, కచ్, భోపాల్, కోల్‌కత్తాలో షూటింగ్‌ జరుపుకుంది. సోనాక్షి ఇందులో గుజరాత్‌కి చెందిన సామాజిక కార్యకర్త సుందర్‌బెన్ జేతా మాధర్‌పర్య 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాన్ని ఆదుకునే ప్రయత్నంలో 299 మంది మహిళలకు నాయకత్వం వహించే పాత్ర. పోస్టర్లో సోనాక్షిని చూస్తుంటే నిజంగా అలనాటి సుందర్‌బెన్‌ తిరిగి వచ్చారా అన్నట్లుందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి. అభిషేక్ దుధయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్, అమ్మీ విర్క్, నోరా ఫతేహి, ప్రణీతా సుభాష్‌ తదితరులు నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.