‘దుర్గావతి’గా మారిన ‘భాగమతి’

‘పతి పత్ని ఔర్‌ వొ’ చిత్రం తరువాత బాలీవుడ్‌ నటి భూమి ఫెడ్నేకర్‌ చాలా బిజీ నటిగా మారిపోయింది. ఈ ఏడాది 2020 ప్రారంభమైందో లేదో వెంటవెంటనే కొత్తకొత్త చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది. తాజాగా తెలుగు దర్శకుడు జి.అశోక్‌ తెరకెక్కిస్తున్న ‘దుర్గావతి’ అనే బాలీవుడ్‌ చిత్రంలో భూమి ఫేడ్నకర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిత్రం ఈరోజే ప్రారంభమైంది. ఫెడ్నేకర్‌ ఇందులో ఐఏఎస్‌ అధికారిగా నటిస్తోంది. టీ-సీరీస్, కేఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భుషన్‌ కుమార్, విక్రమ్‌ మల్హోత్రాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2018లో తెలుగులో వచ్చిన ‘భాగమతి’ చిత్రమే హిందీలో రీమేక్‌గా ‘దుర్గావతి’గా మారింది. గత ఏడాది నటి తాప్సితో కలిసి ‘సాండ్‌ కి ఆంఖ్‌’లాంటి మహిళా నేపథ్యంలో చిత్రంలో షార్పు షూటర్‌గా నటించింది. భూమి ఫెడ్నేకర్‌ గ్లామర్‌తో కూడిన పాత్రలతో పాటు నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటిస్తూ తన వైవిధ్యతను చాటుకుంటోంది. ప్రస్తుతం భూమి ‘శుభ్‌ మంగళ్‌ జ్యదా సావధాన్‌’, ‘భూత్‌ పార్ట్‌ వన్‌: ది హంట్డ్‌ షిప్‌’లాంటి చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలన్నీ ఫిబ్రవరి 2020న తెరపైకి రానున్నాయి.

View this post on Instagram

A post shared by Bhumi✨ (@bhumipednekar) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.