సరికొత్తగా కనిపిస్తున్న అభిషేక్‌ బచ్చన్‌!

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తుంటారు. తాజాగా ఆయన ‘బాబి బిస్వాస్’‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఆయన సరికొత్త అవతారంలో కనిపిసున్నారు. కాంట్రాక్ట్ కిల్లర్‌ బాబి బిస్వాస్‌గా ఇందులో ఆయన నటిస్తున్నారు. ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన షూటింగ్‌ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయింది. తిరిగి షూటింగ్‌ ఇప్పుడు కోల్‌కత్తాలో ప్రారంభమైంది. బౌండ్‌ పిక్చర్స్‌ సమర్పణలో, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుజయ్‌ ఘోష్‌ తనయురాలే దియా అన్నపూర్ణ. ఇదే ఆమెకి తొలి చిత్రం. ప్రస్తుతం కోల్‌కత్తాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా స్టిల్స్ కొన్ని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో కథానాయికగా చిత్రాంగద సింగ్‌ నటిస్తుండగా విద్యాబాలన్‌ విద్య వెంకట్‌సేన్‌ అనే అతిథి పాత్రలో కనిపించనుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.