ఆకట్టుకుంటున్న'బుల్‌బుల్‌' ట్రైలర్‌

బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ నటనలోనే కాదు కొన్ని చిత్రాలకు నిర్మాతగాను వ్యవహరించింది. తాజాగా ఆమె నిర్మించిన 'బుల్‌బుల్‌' అనే చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. అన్వితాదత్‌ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ బోస్‌, తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, పరంబ్రాత ఛటోపాధ్యాయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్‌ 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఇద్దరు పిల్లల మధ్య సంభాషణతో ఆరంభమై, చెట్లపైన నివసించే దెయ్యం కథ చెప్పుకుంటూ కనిపిస్తుంటారు. ఆరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేసిన సన్నివేశాన్ని కూడా ఇందులో చూపించారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం తన తోటి వయసున్న స్నేహితుడు సత్యతో వివాహం జరిగిందని అనుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఉత్కంఠతకు గురిచేసేలా ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు. క్లీన్‌ స్టేట్‌ ఫిల్మ్స పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పావోలి డామ్‌ కూడా ఓ పాత్రలో నటిస్తోంది. అనుష్క శర్మ 2018లో వచ్చిన ‘జీరో’ చిత్రం తరువాత ‘అంగ్రేజి మీడియం’ చిత్రంలో ‘కుడి ను నాచ్‌ దే’ అనే ప్రత్యేక పాటలో మెప్పించింది. అనుష్క శర్మ ఇప్పటికే ‘పాతాళ్‌లోక్‌’ అనే వెబ్‌సీరీస్‌కి సహనిర్మాతగాను వ్యవహరించింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.