ఆగస్టులో సెట్స్ పైకి రానున్న బంటీ ఔర్‌ బబ్లీ 2

అభిషేక్‌ బచ్చన్‌, రాణీముఖర్జీ కలిసి నటించిన చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ’. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ తెరకెక్కుతోంది. ఇప్పటికే సీనిమాకి సంబంధించిన కొంత భాగం చిత్రీకరించారు. రాణీ ముఖర్జీ, సైఫ్‌ అలీఖాన్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, శార్వారి వాగ్‌లు కలిసి నటస్తున్న ఈ సీక్వెల్‌ చిత్రం షూటింగ్‌ని ఆగస్టులో మొదలుపెట్టేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తుంది. వరుణ్‌ వి.శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాత. కరోనా వైరస్‌ వల్ల సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌ని ఆగస్టులో ప్రారం‍భించాలని అనుకుంటున్నారట. ముందుగా సినిమాలోని ఓ పాటను బహిరంగ ప్రదేశంలో చిత్రీకరణ జరపాలని అనుకుంటున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడం కుదరదు కనుక ఇండోర్‌ షూటింగ్‌లోనే కొద్దిమందితోనే పాటను పూర్తి చేయాలని భావిస్తున్నారట. చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ సీనియర్‌ బంటీ పాత్రలో నటిస్తుండగా, రాణీ ముఖర్జీ బబ్లీ సీనియర్‌గా నటిస్తోంది. ఇక సిద్ధాంత్‌, శార్వారి వాగ్‌లు బబ్లీ జూనియర్స్ పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్‌ 17, 2019న ప్రారంభమైన క్రైమ్‌ కామోడీగా రూపొందుతున్న ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ చిత్రం అంతా సక్రమంగా జరిగితే జూన్‌ 26, 2020న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ప్రపంచ సినీపరిశ్రమతో పాటు అన్నీ రంగాలు ఇలా అవ్వడానికి కారణం కరోనా వైరస్‌ మహిమ అంటూ బాలీవుడ్‌ సినీ వర్గాలు వాపోతున్నాయి.

View this post on Instagram

A post shared by Bunty Aur Babli 2 (@buntyaurbabli2) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.