బాలీవుడ్‌ ‘ఛత్రపతి’!

బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు తెలుగు కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఆయనతో హిందీలో ‘ఛత్రపతి’ సినిమాని రీమేక్‌ చేయబోతున్నారు. ప్రభాస్‌ కెరీర్‌కి ఊపునిచ్చిన చిత్రం ‘ఛత్రపతి’. భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. ఆ చిత్రం హక్కుల్ని సొంతం చేసుకున్న ఓ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ, అక్కడి దర్శకుడితోనే సినిమాని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించనున్నారు. బెల్లంకొండ యాక్షన్‌ కథల్లో ఒదిగిపోతుంటారు. ఆయన సినిమాలు హిందీలో డబ్‌ అవుతూ, అంతర్జాలంలో మంచి ఆదరణ పొందుతుంటాయి. ‘ఛత్రపతి’ రీమేక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికొచ్చే అవకాశాలున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.