మూడు సంవత్సరాల తరువాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ కూడా చిత్ర భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా షూటింగ్ నవంబర్లోనే ప్రారంభమైంది. ఇందులో జాన్ అబ్రహం కూడా నటిస్తున్నారు. దీపికా సోమవారం రెండు రోజుల షూటింగ్ కోసం చిత్రబృందంలో చేరింది. తరువాత మరోసారి డిసెంబర్ మధ్యలోనూ దీపికా చిత్రంలో తిరిగి భాగం కానుంది. సినిమాకి సంబంధించిన ప్రధాన యాక్షన్ సన్నివేశాలను వచ్చే యేడాది జనవరి నుంచి జూన్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మొత్తం మీద షారుఖ్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘జీరో’ చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం ‘పఠాన్’ కావడం విశేషం. సల్మాన్‌ఖాన్ నటిస్తున్న ‘టైగర్3’లో షారుఖ్ కనిపించనున్నారట.