ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి, నీనా గుప్తా, సాక్షి తన్వర్ నటిస్తున్న కొత్త చిత్రం ‘డయల్ 100’. రెన్సిల్ డిసిల్వా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. సోనీ పిక్చర్స్, అల్కెమీ ఫిల్మ్స్లలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా, స్వప్నాలు నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శకుడు డిసిల్వా మాట్లాడుతూ...‘‘సినిమా షూటింగ్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. రెండు పెద్ద సంస్థలు కలిసి నిర్మిస్తున్న సినిమాకి దర్శకత్వం వహించడం చాలా సౌలభ్యం ఉంది. ఇదొక ప్రయోగాత్మకంగా ఉంటుంది. చాలా కష్టమైన, ఉత్తేజకరమైన అంశం. అందరిని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 100 అనేది థ్రిల్లర్ చిత్రంపై అందరికి ఆసక్తిని కలిగిస్తుంది. ప్రతిదాన్ని మళ్లీ చూసేలా, సినిమాలో ఏముందో తెలుసుకోవడానికి మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం అవుతోందని’’అన్నారు. ఈ మధ్య కాలంలో మనోజ్ బాజ్పేయి వెబ్ సీరీస్ చిత్రాల్లో నటిస్తూ తనదైన శైలిని కనబరుస్తున్నారు.