‘దిల్‌ బెచారా’ నుంచి మరో ప్రేమగీతం


హిందీ నటుడు సుశాంత్‌సింగ్‌ చివరిసారిగా నటించిన చిత్రం 'దిల్‌ బెచారా'. చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పాటలు విడుదలై ఆహుతులను అలరించాయి. సంజన సంఘీ కథానాయిక. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ‘‘జబ్సే హువా హై యే అచ్చా సా లగ్తా హై.. దిల్ హో గయా ఫిర్ సే బచ్చా సా లగ్తా హై..’’ అంటూ సాగే ‘తారే జిన్‌’ పాట ఒకటి విడుదలైంది. అమిత్‌ భట్టాచార్య సాహిత్యానికి, మోహిత్ చౌహాన్, శ్రేయా ఘోషల్ అందమైన గొంతులో జలపాతంలో జారుతుండగా, ఏ.ఆర్‌.రెహ్మన్‌ అందిన సంగీత స్వరాలు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంది. ఈ అందమైన ప్రేమ పాట యువ ప్రేమికులకు కొంగొత్త అనుభూతులను పంచేలా ఉందని చెప్పవచ్చు. 2014లో హాలీవుడ్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామాగా అలరించిన 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌' చిత్రానికి రిమేక్‌గా ‘దిల్‌ బెచారా’ చిత్రం నిర్మితమైంది. ముఖేష్‌ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ మధ్యనే విడుదలైన సినిమా ట్రైలర్‌ కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. చిత్రంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూడా నటించారు. చిత్ర ట్రైలర్‌ సమయంలో దర్శకుడు ముఖేష్‌ ఛబ్రా మాట్లాడుతూ..‘‘మా రెండేళ్ల నిరీక్షణ అనంతరం సినిమాని విడుదల చేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. నా హృదయానికి దగ్గరైన స్నేహబంధం లభించింది. నా చివరి శ్వాస వరకు నాతోపాటు ఉండే సుశాంత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘దిల్‌ బెచారా’ విడుదలకు సిద్ధమైందని’’ చెప్పారు. ఈనెల 24వ తేదీన హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.