బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన ఎమ్రాన్‌ హరామి

ఇండో-అమెరికన్ ప్రొడక్షన్ పతాకంపై ఫీచర్‌ చిత్రంగా శ్యామ్‌ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హరామి’. ఎమ్రాన్‌ హష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2020కి ఎంపికైంది. ఈ ఏడాది భారత్‌ నుంచి బుసాన్‌ వేడుకలకు ఎంపికైన ఏకైక చిత్రం ‘హరామి’. కొరియాలో జరుగుతున్న ఈ పోటీలలో మొత్తం 194 చిత్రాలన్నీ బుసాన్‌ ఫిల్మ్ వేడుకల్లో అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు ప్రదర్శిస్తారు. సౌత్‌ కొరియాలో ఈ వేడక జరగనుంది. సినిమా గురించి నటుడు ఎమ్రాన్‌ స్పందిస్తూ..‘‘శ్యామ్‌ మాదిరాజు చెప్పిన ఈ చిత్రం స్ర్కిప్టు చెప్పగానే నన్నెంతో ఆకర్షించింది. ఇలాంటి గొప్పవేడుకల పోటీ విభాగంలో ప్రవేశించి ఎంపికైనందుకు, చిత్రబృందానికి ఓ గొప్పవరం. త్వరలోనే భారతీయ ప్రేక్షకులతో కలిసి పంచుకొనే రోజు కోసం ఎదురుచూస్తున్నాను..’’అన్నారు. చిత్ర దర్శకుడు శ్యామ్‌ మాదిరాజు మాట్లాడుతూ..‘‘హరామి’ కోసం ముంబై వీధుల్లో, మురికివాడల్లోని ఆశ, విముక్తి యొక్క సార్వత్రిక కథ ఇది. ప్రేమ, శ్రమ, ఈ చిత్రం నన్ను ముందుకు నడిపించేలా చేశాయి. ఈ చిత్రం చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఎమ్రాన్ హష్మి 'సాగర్ భాయ్' పాత్రను చాలా బాగా పోషించారు. అంతేకాదు మాజీ ఇంగ్లీష్ టీచర్ గాంగ్ లార్డ్ గా మారిపోయాడు. ఈ పాత్ర చాలా సంక్లిష్టంగా, సూక్ష్మం. అయినా సరే ఎమ్రాన్ ఇంతకు ముందు చేసినదానికి భిన్నంగా చేశారు. ఇది ఎమ్రాన్, మా ఇద్దరికీ నిజమైన సవాలుగా చెప్పుకోవచ్చు. చిత్రీకరణలో భారీ సవాళ్లు ఉన్నప్పటికీ విక్టోరియా టెర్మినస్, బొంబాయి సెంట్రల్, ఇతర రైళ్ల స్టేషన్లలో చిత్రీకరణ జరిపాం. సినిమా కోసం అమెరికా, యుకె, డెన్మార్క్, దక్షిణాఫ్రికా నుంచి అంతర్జాతీయ ప్రతిభావంతులతో సహా 200 మందికి పైగా సిబ్బందితో కష్టపడి పనిచేశాం. ధారావి మురికివాడలలో సెట్, మొహమ్మద్ అలీ రోడ్‌లాంటి రద్దీ వీధుల్లో ఎమ్రాన్ హష్మి నటించారని’’ చెప్పారు. నిర్మాతలు ప్రవీష్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సహా నిర్మాత పాల్‌ ఫీగ్‌ మాట్లాడుతూ..‘‘హరామి’ చిత్రం ఒక కళాత్మకమైన, ధైర్యమైన చిత్రం. అదే విధంగా ఆదునిక తరహా చిత్రనిర్మాణాన్ని కలిగి ఉంది. ఇండియాలోని ప్రేక్షక్షులను కచ్చితంగా మెప్పిస్తుంది. ఇందులో ఎక్కువగా బాలనటులు ఉన్నారని చెప్పారు. మరో నిర్మాత పాల్‌ఫీగ్‌ స్పందిస్తూ..‘‘ఈ చిత్రాన్ని మేమెంతో ప్రేమిస్తున్నాం. ఇలాంటి బరువైన, భావోద్వేగపు కథలను కొత్త తారలతో ఇమ్రాన్ హష్మి నటిండచం, ఆయన లోతైన ప్రతిభతో పాటు శ్యామ్‌ మాదిరాజు చిత్రానికి ఉన్న సమతౌల్యతను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లారు. సినిమా ఎప్పుడెప్పుడు బుసాన్‌ ఫెస్టివల్లో ప్రదర్శితం చేస్తారో అప్పటి వరకు వేచి ఉండలేకోపతున్నామ’’న్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.