‘గంగూబాయి’ సెట్‌ కూల్చివేస్తారా?

ప్రస్తుతం సమయంలో కరోనా వైరస్‌ కారణంగా చిత్రసీమ చాలా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్‌ నటిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. చిత్రం కోసం ముంబైలో వేసిన ఆరుకోట్ల రూపాయల సెట్‌ని తొలగించమని సదరు యాజమాన్యం చెప్పిందట. ఎందుకంటే వీరికి ఇచ్చిన సమయం పూర్తి అవ్వడంతో సెట్‌ కూల్చివేయాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు. కరోనా లేకపోతే ఈపాటికి చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ చాలా వరకు పూర్తియ్యేది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చిత్రసీమలో షూటింగ్స్‌ తిరిగి ఎప్పుడు మొదలవుతాయనే అంశం సంధిగ్దంలో ఉంది. సంజయ్‌ ఈ చిత్రం కోసం వేసిన అతిపెద్ద సెట్స్‌లో ఇదొకటి. పెన్‌ మరుదార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రం రచయిత, పాత్రికేయుడు హేస్సేన్‌ జైది రచించిన ‘మాఫియా క్వీన్‌ ఆఫ్‌ మంబై’ పుస్తకాధారంగా తెరకెక్కుతుంది. ఇందులో అలియా గంగూబాయి కతియావాడిగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ గత ఏడాది డిసెంబర్‌ 27న ప్రారంభమైంది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రసీమలోని పలు చిత్రాల షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే!



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.