‘క్రిష్‌’ మరోసారి వచ్చేస్తున్నాడహో!

అతనో సాధారణ మనిషి. అన్యూహ్యంగా అద్భుతశక్తులు వస్తాయి. ఆ శక్తులతో సామాన్యులకు సాయం చేస్తుంటాడు. ఇలాంటి సూపర్‌ హీరోలు వెండితెరకు కొత్తేం కాదు. ఆంగ్ల చిత్రాల్లో అయితే సూపర్‌మాన్, ఐరన్‌మాన్, సైడర్‌మాన్‌ అంటూ చాలా మంది సూపర్‌ హిరోస్‌ ఉన్నారు. కానీ భారత్‌లో సూపర్‌మాన్‌ అంటే ఇక్కడి సినీ అభిమానులకు టక్కున గుర్తుకు వచ్చేది ‘క్రిష్‌’. క్రిష్‌గా హృతిక్‌ రోషన్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. తొలిసారిగా 2006లో ప్రేక్షకులను అలరించిన క్రిష్, ఇప్పటి వరకూ మూడు సినిమాల్లో దుండగుల భరతం పట్టాడు. హాలీవుడ్‌ స్థాయి సాంకేతికత, కథాకథనాలుతో వీక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి ‘క్రిష్‌’ సినిమాలు. ఇప్పుడు మరోసారి వెండితెరపై స్వైర విహారం చేయనున్నాడు క్రిష్‌. హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ నిర్మాణంలో ‘క్రిష్‌4’ సినిమాను తీస్తున్నారు. దీన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హృతిక్‌తో ‘కాబిల్‌’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సంజయ్‌ గుప్తా ఈ సినిమానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.