సరికొత్తగా అమితాబ్‌ ‘ఝండ్‌’ టీజర్‌

ఎలాంటి హడావుడి లేకుండా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ తన కొత్త చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ సోమవారం విడుదల చేశారు. ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ ఆ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. నాగరాజ్‌ మంజులే దర్శకత్వంలో ‘ఝండ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు బిగ్‌బీ. ఇందులో ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించబోతున్నాడాయన. మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన మురికివాడల యువకులను మార్చి ఓ ఫుట్‌బాల్‌ జట్టును తయారు చేస్తాడు. టీజర్‌ చూస్తే .. కొందరు య³వకులు చైన్లు, కర్రలు, బ్యాట్లు, రాళ్లు చేత్తో పట్టుకుని ఎవరినో కొడతానికి వెళ్తుంటారు. అమితాబ్‌ మాత్రం కనిపించరు. కేవలం కథ ఎవరి చుట్టూ తిరుగుతుందో తెలియజేసేలా రూపొందించిన టీజర్‌ సరికొత్తగా ఉంది. దీంతోపాటు చిత్ర విడుదల తేదీని వీడియోలో ప్రకటించారు. 2020 మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగరాజు మంజులే, గార్గి కులకర్ణి, మీనూ అరోరా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.