గ్యాంగ్‌స్టర్‌ గణపతి రాయ్‌ని చూశారా!

జాన్‌ అబ్రహం గతంలో ప్రేమికుడిగా, పోలీస్‌ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం జాన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముంబై సాగా’ చిత్రాన్ని టీ-సీరీస్, ఫెదర్‌ ఫిల్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి విడుదలైంది. పోస్టర్లో జాన్‌ ఓ కుర్చీలో కాలుమీద కాలువేసుకొని, ఎదురుగా ఎవర్నో తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది. పోస్టర్లో జాన్‌ అబ్రహం వేషధారణ కూడా ఆకట్టుకునేలా, వైవిధ్యంగా ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చిత్రంలో ఇమ్రాన్‌ హస్మి పోలీస్‌ అధికారి అంబర్‌ఖాన్‌ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తున్న చిత్రంలో కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి, ప్రతీక్‌ బబ్బర్, గుల్షన్‌ గ్రోవర్‌ తదితరులు నటిస్తున్నారు. సుమారు డెభ్బై కోట్లతో నిర్మితమౌతున్న ఈ చిత్రం జూన్‌ 19, 2020న తెరపైకి రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.