ఆ ఒక్క సెట్‌కు పదికోట్లా!

వరుణ్‌ ధావన్, అలియాభట్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘కళంక్‌’. ఈ చిత్రంలోని ఓ సెట్‌ కోసం ఏకంగా పదికోట్లు ఖర్చు పెట్టారట. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో 1940 నాటి పాత ధిల్లీ భవనం, దాని చుట్టూ పరిసరాల సృష్టి కోసం. ఈ మధ్యనే సినిమా టీజర్‌ ఒకటి విడుదలైంది. ఆ టీజర్‌లో.. రాజభవనము మధ్యలో సాగరం, అందులో పడవపై వరుణ్‌ ధావన్, అలియాభట్‌లు ప్రయాణం చేస్తున్నది దృశ్యం ఒకటి మనకు కనిపిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అభిషేక్‌ వర్మన్‌ దర్శకుడు. ఇంకా ఇందులో సంజయ్‌దత్, మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్‌ తదితర నటులు నటిస్తున్నారు. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.