'తలైవి' షూటింగులో పాల్గొన్న క్వీన్‌ కంగనా!

గత కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల హడావుడి మొదలైంది. దాంతో నటీనటులు బయటకు వచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు అన్నీ భాషా చిత్రాలు తమ షూటింగ్‌ని మొదలుపెట్టాయి. తాజాగా బాలీవుడ్ నటి‌ కంగనా రనౌత్‌ సెట్లో అడుగుపెట్టింది. ఆమె ‘తలైవి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కంగనా దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌తో కలిసి కొన్ని ఫోటోలు తన ట్విట్టర్లో షేర్‌ చేసింది. ‘‘గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇవి నిన్న ఉదయం సన్నివేశాల సందర్భంగా చర్చించకున్న నేపథ్యం. ప్రతిభావంతుడైన, ఎంతో ప్రేమగల దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌ కలిసున్న కొన్ని స్టిల్స్ ఇవి. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ నాకు చాలా ఓదార్పు ఒకే ఒక్కటి ‘తలైవి’ సినిమా సెట్‌ అంటూ..’’ ట్విట్టరో పేర్కొంది. కంగాన బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్యపై న్యాయం జరగాలంటూ తన వంతుగా కృషి చేస్తుంది. ఆ మధ్య మహారాష్ర్ట ప్రభుత్వం కంగానకు చెందిన బిల్డింగ్‌ను కూలగొట్టారు. మున్సిపాలిటీ అనుమతులు తీసుకొకుండా ఆ భవంతి పనులు చేపట్టినందుకే అలా చేయాల్సి వచ్చిందని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చెప్పారు. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తలైవి’లో ఎమ్జీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ జయలలిత తల్లిగా నటిస్తుంది. ప్రకాష్‌రాజ్‌ కరుణానిధిగా, జిషు సేన్‌గుప్తా శోభన్‌బాబు పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.