దీపావళికి ‘ధాకడ్‌’ వస్తుందా?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘ధాకడ్‌’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్, టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని దీపావళి పండుగ నాటికి ప్రేక్షకులను అలరిస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. చిత్ర నిర్మాత సోహైల్‌ మాట్లాడుతూ ‘‘ధాకడ్‌’ను కచ్చితంగా అనుకున్న తేదీకే విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. కరోనా కారణంగా ఎక్కడ ఉన్న పనులు అక్కడే ఆగిపోయాయి. మా దర్శకుడు రజ్‌నీష్‌ ఘాయ్‌కి యాడ్స్‌లో ఏంతో పేరుంది. ఇప్పటికే ఆయన కంగానాతో మూడు వాణిజ్య ప్రకటనలు కూడా చేశారు. వారిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. త్వరలోనే చిత్రాన్ని తీసుకెü™్ల ఆలోచనలో ఉన్నాం’’ అంటున్నారు. మొత్తం మీద ‘ఢాకడ్‌’ను అనుకున్న సమయానికే తెరపైకి తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కంగనా తమిళంలో ‘తలైవి’ చిత్రం చేస్తోంది. తాజాగా ఆమె సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌కి పది లక్షల రూపాయల సాయాన్ని కూడా అందించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.