ట్రాన్స్ జెండర్‌ పాత్రలో వాణీ కపూర్‌

బాలీవుడ్‌లో ఈ మధ్య వైవిధ్యమైన చిత్రాలు వస్తున్నాయి. వాటిలో నాయికానాయకలు పోటీపడీ నటిస్తున్నారు. తాజాగా అందాల భామ వాణీ కపూర్‌ ఛండీఘర్‌ కరే ఆషికి చిత్రంలో ట్రాన్స్ జెండర్‌ (లింగమార్పిడి) పాత్రలో నటించనుందని సమాచారం. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖుర్రానా కూడా నటిస్తున్నారు. ఆయష్మాన్‌ ఇప్పటి వరకు చేసిన చాలా చిత్రాల్లో వైవిధ్యతను చూపించారు. ఆయుష్‌ష్మాన్‌ విక్కీడోనర్‌), శుబ్‌ మంగల్ సావ్ధాన్‌ లాంటి చిత్రాల్లో ఎలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను నవ్వించారు. అయితే వాణీ కపూర్‌ చిత్రంలోని పాత్ర గురించి దర్శకుడు అభిషేక్‌ని ఓ మీడియా అడిగినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానంటూ సమాధానం దాటవేశారు. మొత్తం ఈ చిత్రంలో ఆయుష్‌ - వాణీల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ గతంలో రాక్ ఆన్ కై పో చే, కేదార్‌నాథ్‌లాంటి చిత్రాలను తెరకెక్కించారు. వాణీ కపూర్‌ తెలగులో నానితో కలిసి ఆహా కల్యాణం చిత్రంలో నటించింది. ఈ మధ్యనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న హిందీ చిత్రం బెల్‌బాటమ్‌లో ప్రధాన కథానాయికగా నటించింది. చిత్రం షూటింగ్‌ స్కాట్లాండ్‌లో జరుపుకుంది. సినిమాని వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 2, 2021న విడుదల చేయనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.