సోన్మ్కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నీర్జా’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రామ్ మద్వానీ. ఇప్పుడు ఆయన బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్ ఓ చిత్రం చేయబోతున్నారు. అదే ‘ధమాకా’. ఆదివారం కార్తిక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ట్విటర్లో పంచుకున్నాడు. ‘ది టెర్రర్ లైవ్’ అనే దక్షిణ కొరియా చిత్రానికి రీమేక్ అని సమాచారం. ఇందులో కార్తిక్ జర్నలిస్ట్‌గా నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే నెల్లో సెట్స్‌పైకి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. కార్తిక్ ప్రస్తుతం నటిస్తున్న ‘భూల్ భులయ్యా 2’, ‘దోస్తానా 2’ చిత్రాల కంటే ముందే ‘ధమాకా’ విడుదలయ్యే అవకాశం ఉంది.