కృతికా అగర్వాల్‌ పాత్రలో తాప్సీ
బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిషన్‌ మంగళ్‌’. జగన్‌ శక్తి దర్శకత్వంలో రూపొందుతోంది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తాప్సి కృతికా అగర్వాల్‌ పాత్రలో నటిస్తోంది. తాజాగా తాప్సీ తన పాత్ర చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సినిమాలోని తాను నటించిన పాత్ర లుక్‌ను కూడా ఇన్‌స్టాలో చూపించింది. ‘‘మరో అందమైన ప్రయాణం ముగిసింది. ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాకు సంబంధించిన నా పాత్ర చిత్రీకరణ పూర్తైంది. ప్రతి సినిమా వచ్చిపోతుంటుంది. కానీ కొన్ని సినిమాలు మ్యాజిక్‌ను రుచి చూపించి వెళ్లిపోతుంటాయి’’ అని రాసింది. ‘‘ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతమైన నటులు ఉన్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం’’ తెలిపారు. ఈ చిత్రంలో విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్‌ జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2013లో భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నిత్యామేనన్ 
ఇండియన్‌ స్పేస్‌ రెసెర్చ్  ఆర్గనైజేషన్‌( ఇస్రో) మార్స్‌ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మిషన్‌ మంగళ్‌యాన్‌’. జగన్‌ శక్తి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈసినిమాలో కృతికా అగర్వాల్‌ పాత్రలో తాప్సీ నటిస్తుండగా. సైటింస్ట్‌ వర్షా పాత్రలో నిత్యామేనన్‌ కనిపించబోతున్నారు. మొదటిసారిగా ఆమె ఈ చిత్రంలో బాలీవుడ్‌ రంగంలో అడుగుపెడుతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.