రాజ్‌ కుమార్‌ చేతుల్లోకి ‘ఖైదీ’?

మిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సంచలనం సృష్టించిన ‘ఖైదీ’ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కార్తి కథానాయకుడుగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. నాయిక, పాటలు లేకుండా కేవలం కథా బలంతో ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసిన సినిమాగా సుస్థిర స్థానం సంపాందించుకుంది. దీంతో ‘ఖైదీ’ హిందీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడని అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆసక్తి పెరిగింది అందిరిలో. కథానాయకుడు ఎవరు? అయన్ను డైరెక్ట్‌ చేసేదెవరు? అని చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ విషయం బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. కార్తి పాత్రలో ఏ బాలీవుడ్‌ నటుడు కనిపిస్తాడో పక్కన పెడితే ఇలాంటి కథను తెరకెక్కించే దర్శకుడు గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్‌నే ఈ చిత్రానికి దర్శకుడుగా తీసుకోవాలని నిర్మాతలు భావించినా ఇతర ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉండటంతో ఆ అవకాశం బాలీవుడ్‌ దర్శకుడుకే దక్కిందట. రాజ్‌ కుమార్‌ సంతోషి చేతుల్లోకి ‘ఖైదీ’ వెళ్లబోతుందని సమాచారం. ఇప్పటికే చర్చలు సాగాయని, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం ఈయన ‘బ్యాడ్‌ బాయ్‌’ చిత్రం తీస్తున్నారు. ఇది పూర్తైన తర్వాత ‘ఖైదీ’ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ‘ఖాకీ‘, ‘పుకార్‌‘,‘ ఫ్యామిలీ’, ‘అజబ్‌ ప్రేమ్‌కీ ఘజబ్‌ కహానీ’ వంటి వైవిధ్య చిత్రాల దర్శకుడే రాజ్‌కుమార్‌. కథానాయకుడి వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.