‘క్షణం’ చిత్రానికి మరో సీక్వెల్‌

తన కూతురిని వెతికి పెట్టమని స్నేహితుడిని సాయం అడుగుతుంది కథానాయిక. కానీ ఆమెకు కూతురే లేదంటుంది చుట్టూ ఉండే ప్రపంచం. మరి ఆ చిన్నారి గురించి తెలుసుకోవడానికి కథానాయకుడు చేసే ప్రయాత్నాలు, అందులో ఉండే మలుపులు, ఎత్తుగడలు, ఉత్కంఠభరితంగా సాగే కథనం ఇవి అన్ని కలిపితే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం‘ క్షణం’గా నిలిచింది. అడవి శేష్‌ కెరీర్‌కి బ్రేక్‌ నిచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘భాఘీ’ అనే పేరుతో రూపొందించారు. దీనికి కొనసాగింపుగా ‘భాఘీ2’ని కూడా తెరకెక్కించారు. హిందీ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను ఫ్రాంచేజిగా కొనసాగించటం సర్వ సాధారణమే అందుకే ఇప్పుడు ‘భాఘీ3’ ని కూడా రూపొందిస్తున్నారు అక్కడి దర్శకనిర్మాతలు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో కూడా టైగర్‌ ష్రాఫ్, శ్రద్దా కపూర్‌ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.