లుకా చుప్పీ ‘కోకా కోలా’ సాంగ్‌

కృతిసనన్, కార్తిక్‌ ఆర్యన్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘లుకా చుప్పీ’. ఈ చిత్రానికి సంబంధించిన ‘కోకా కోలా’ సాంగ్‌ విడుదలైంది. టోనీ కక్కర్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట తెగ హంగామా చేస్తోంది. టోని కక్కర్, మెల్లో.డి రాసిన ఈ గీతాన్ని టోనీ కక్కర్, నేహా కక్కర్‌లు గమ్మత్తైన గొంతులతో ఆలపించారు. ఈ చిత్రంలో పెళ్లికి కాకుండానే రహస్య సహజీవనం చేస్తుంటారు హీరోహీరోయిన్‌. అనుకోకుండా వారి కుటుంబ సభ్యులు కూడా వీరి జీవితంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఏం జరిందనేది మిగిలిన చిత్రకథ. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి దినేష్‌ విజ్జన్‌ నిర్మాత. ఇంకా చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, వినయ్‌ పాఠక్, అపర్‌శక్తి ఖురానా తదితరులు నటిస్తున్నారు. మార్చి 1, 2019న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.