అలరిస్తున్న ‘మర్‌జావాన్‌’ సాంగ్‌

సిద్ధార్థ్‌ మల్హోత్రా, తారా సుతారియా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మర్‌జావాన్‌’. మిలాప్‌ జవేరి దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ఏక్‌ తోహ్‌ కుమ్‌ జిందగాని’ అంటూ సాగే వీడియో సాంగ్‌ ఒకటి విడుదలైంది. ఈ పాటను హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, నోరా ఫతేహిలపై చిత్రీకరించారు. తనీష్‌ బాగ్చి, ఏ.ఎమ్‌.తురాజ్‌ కలంలో నుంచి జాలువారిన ఈ పాటకి తనీష్‌ బాగ్చి సంగీతం అందించగా, నేహా కక్కర్, యష్‌ నర్వేకర్‌లు ఆలపించారు. యాక్షన్‌ ప్రేమకథా నేపథ్యంగా వస్తున్న చిత్రాన్ని టీ-సీరీస్‌ - ఎమ్మై ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో ప్రతినాయకుడిగా రితేష్‌ దేశ్‌ముఖ్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.