ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. ‘మిషన్‌ మంగళ్‌’

భా
రత్‌ 2013లో చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ మిషన్‌ నేపథ్యంతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవితాధారంగా రూపొందిస్తున్నారు. రాకేష్‌ పాత్రను అక్షయ్‌కుమార్‌ పోషించారు. జగన్‌ శక్తి దర్శకత్వం వహించారు. ఫాక్స్‌ స్టార సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు అక్షయ్‌. ‘‘ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. భారత దేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్‌. ఈ స్ఫూర్తిదాయక కథ ఆధారంగా రానున్న చిత్ర టీజర్‌ ఇదుగో’’ అని టీజర్‌తో పాటు ఓ వ్యాఖ్యను కూడా జోడించారు అక్షయ్‌. మంగళ్‌యాన్‌ నింగిలోకి వెü™్లందుకు లాంఛింగ్‌ ప్యాడ్‌ వద్ద సిద్ధంగా ఉండటం. అక్షయ్‌.. అతని బృందమంతా ఆ ప్రయోగాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమై ఉండటం వంటి సన్నివేశాలతో టీజర్‌ను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఈ సినిమాలో విద్యాబాలన్‌ శాస్త్రవేత్తల బృందానికి అధికారిణిగా కనిపించనున్నారు. నిత్యా మేనన్, తాప్సి, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.