టుబుతో ఇషాన్‌ రొమాన్స్‌!

బాలీవుడ్‌ నటి టబు వేశ్యగా నటిస్తున్న చిత్రం ‘ఎ సూటబుల్‌ బాయ్‌’. మీరా నాయర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇషాన్‌ ఖట్టర్‌ రాజకీయ నాయకుడి కుమారుడిగా నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. అందులో టబు పసుపురంగు దుస్తులతో తల్లో మల్లెపూలు పెట్టుకొని ఉండగా, ఇషాన్‌ తెల్లని బట్టలు వేసుకొని టబు వైపు చూస్తున్న దృశ్యం ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ రచయిత విక్రమ్‌ సేథ్‌ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో టబు సైదా బాయి అనే వేశ్య పాత్రలో నటిస్తుండగా, ‘దఢక్‌’ నటుడు ఇషాన్‌ రాజకీయ నాయకుడి కుమారుడిగా, వేశ్య సైదా బాయికి దగ్గరై అయ్యే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం లక్నో నగరంలోని రాజభవనాల్లో, మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరించారు. టబు గతంలో మీరా నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ది నామ్‌ సేక్‌’ చిత్రంలో నటించింది. వచ్చే సంవత్సరం జూన్‌ 2020న తెరపైకి వచ్చే ఇందులో తాన్య మణిక్తాలా, రసిక దుగ్గల్, షహానా గోస్వామి, నమిత దాస్, వివేక్‌ గోంబర్‌ తదితర నటీనటులు నటిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.