మొగుడు, పెళ్లాం మధ్యలో వేరొకరు!

వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటి భూమి పెడ్నేకర్‌. ప్రస్తుతం ముదస్సార్‌ అజీజ్‌ దర్శకత్వంలో ‘పతి, పత్ని ఔర్‌ వో’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌ భూమి భర్తగా నటిస్తున్నారు. కథలోకి వెళ్తే ఇదొక రొమాంటిక్‌ కామెడీ కథగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే తెరపైకి రానున్న చిత్రం గురించి భూమి మాట్లాడుతూ..‘‘ఇదొక విచిత్రమైన కథ. భార్యా భర్త మధ్యలో ఇంకొరు. భర్త చింటు (కార్తిక్‌) వేరొక అమ్మాయి (అనన్య పాండే)కు దగ్గర అవుతుంటాడు. అమ్మాయి నుంచి నా భర్తను ఎలా కాపాడుకున్నానదే కథ. కార్తిక్‌తో కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం ఇది. అందరి అంచనాలకు తగ్గట్లే మేము మా పాత్రలకు న్యాయం చేస్తాం. చిత్రంపై మాకంటే ప్రేక్షకులకే ఉత్సుకత ఎక్కువగా వుందని’’ చెబుతోంది. 1978లో బి.ఆర్‌.చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘పతి పత్ని ఔర్‌ వో’ చిత్రానికి ఇది రీమేక్‌. బి.ఆర్‌.స్టూడియోస్, టీ-సిరీస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమాకి సంజనా రెడ్డి కథ అందిస్తున్నారు. డిసెంబర్‌ 6, 2019 తెరపైకి రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.