భూత వైద్యానికి పరిష్కారం ‘ఫోన్ బూత్’

బాలీవుడ్‌ నటి కత్రీనా కైఫ్‌, సిద్దాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌ నటిస్తున్న చిత్రం ‘ఫోన్‌ బూత్’‌. గుర్మిత్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిధ్వానిలు కలిసి నిర్మిస్తున్నారు. హర్రర్‌ కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ పోటో ఒకటి విడుదలైంది. ఈ సందర్భంగా కత్రీనా కైఫ్‌ - సిద్దాంత్‌, ఇషాన్లతో కలిసున్న ఫోటో వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచకుంటూ..‘‘బూత్‌ సమస్యలన్నింటికి ఒక స్టాప్‌ షాప్‌, 2021లో మీ దగ్గరలోని అన్ని సినిమాల్లో ఫోన్‌ భూత్‌ రింగింగ్‌ అవుతోందని..’’పేర్కొంది. మరో నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ స్పందిస్తూ..‘‘ఇది కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించక ముందు మార్చిలో చేసిన పోస్టర్‌ కోసం షూట్‌ చేసిన పోస్టర్‌’’ అంటూ చెప్పారు. ఇక సిద్దాంత్‌ కూడా చిత్రం పోస్టర్‌పై స్పందిస్తూ..భూత్‌ ప్రపంచంలో ట్రిపుల్‌ ట్రబుల్‌, మీరు దారిలో నవ్వుతున్నం కాలం..’’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. విజయవంతమైన అమెరికన్ థ్రిల్లర్ ‘ఫోన్ బూత్’ రీమేక్‌లో ఫర్హాన్ అక్తర్ ఓ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది చిత్రం విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.