పృథ్వీరాజ్‌ షూటింగ్‌ మళ్లీ మొదలైంది!

అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో అక్షయ్‌ సరసన ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్‌ నటిస్తుంది. లాక్‌డౌన్ ప్రకటించగానే అన్నీ చిత్రాల మాదిరి ఈ సినిమా కూడా తన షూటింగ్‌ని వాయిదా వేసుకొంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు స్పందిస్తూ..అవును మేం వైఆర్‌ఎఫ్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమయ్యే చిత్ర షూటింగ్‌ని తిరిగి ప్రారంభిస్తున్నా అని చెప్పడానికి సంతోషంగా ఉందని వెల్లడించారు. చిత్రంలో సోనూసూద్‌ ఈ నెల 10వ తేదీని నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. చిత్రాన్ని నిర్మించే క్రమంలో ప్రతితీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారట. చిత్రంలో సంజయ్‌ దత్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్‌ 13న కథానాయిక మానుషీ పాల్గొనుందని సమాచారం. ఇక సంజుబాయి దీపావళి పండుగ తరువాత షూటింగ్‌లో పాల్గొంటారు. మొత్తం ఇప్పుడు బాలీవుడ్‌లోనూ పెద్ద చిత్రాలు తిరిగి షూటింగ్‌ని మొదలుపెట్టడం శుభ పరిమాణం అని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిత్రం కోసం అక్షయ్‌ కుమార్‌ డైలాగ్‌కోచ్‌ని పెట్టుకున్నాడట. ఇలా చేయడం అతనికిదే తొలిసారి. అంతేకాదు చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని సంభాషణలు బాగా రావాలంటే కోచ్‌ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే భావించాడట అక్షయ్‌. మానుషి చిల్లర్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ భార్య సన్యోయోగిత పాత్రలో నటిస్తోంది. శంకర్-ఇషాన్- లాయ్‌ సంగీత‌ స్వరాలు అందిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.