నాకు ఆ కోరిక ఉంది.. కానీ..

ప్రముఖ బాలీవు అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొని సరిగ్గా పదినెలలు దాటిపోయింది. అయినా ఇంకా మాతృత్వం వైపు అడుగులు పడలేదు. ఇదే విషయాన్ని కొంతమంది అడగ్గా ప్రియాంక స్పందిస్తూ..‘‘నాకు తల్లి కావాలని ఉంది. అయితే అది ఇప్పుడే కాదు. నేను చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. అవి పూర్తి కాగానే మాతృత్వపు మాధుర్వాన్ని అనుభవించాలనుకుంటున్నా. ఈ ప్రపంచంలో తిండి ఊరికే దొరకదు కదా. దానికి మనం కష్టపడాలి. కొన్ని కావాలంటే కొన్నింటిని వదులుకోవాలి. ఇది జగమెరిగిన సత్యం. మనం అనుకున్నవీ అన్నీ జరగవు కదా! ఆపైవాడు మనపై కరుణ చూపాలి’’అంటూ చెబుతోంది. తన కంటే చిన్నవాడైన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు నిక్‌ జోనాస్‌ని గత ఏడాది డిసెంబర్‌ 1న పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక సోనాలి బోస్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రంలో నటిస్తుంది. అక్టోబర్‌ 11, 2019న ప్రేక్షకుల ముందకు రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.