అక్టోబర్‌లో ప్రారంభం కానున్న రాధే షూటింగ్!


కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్‌ భాయి’. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగ్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు జూన్‌ నుంచే పరిమిత సిబ్బందితో షూటింగ్‌ జరపుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. ఆగస్టులో సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తూ ముంబైలోని మెహబూబ్‌ స్టూడియోలో ఒక ఫ్లోర్‌ని అనుమతి తీసుకుంది నిర్మాణ సంస్థ. కానీ షూటింగ్‌ ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందానికి లేదట. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండడంతో నిర్మాతలు అతుల్‌ అగ్నిహోత్రి, సోహైల్‌ఖాన్‌, నిఖిల్‌ నమిత్‌లు షూటింగ్‌ని అక్టోబర్‌ చివరి వారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇండోర్లో షూటింగ్‌ అంటే కొంచెంది ఇబ్బందిగా ఉంటుందని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండనుందనే కారణంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్ని సక్రమంగా జరిగి ఉంటే దిపావళి పండగ నాటికి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొంటే వచ్చే ఏడాదినే సినిమా విడుదలకు సరైన సమయంగా భావిస్తున్నారట. చిత్రంలో కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కొంత మేర పూర్తి చేసుకుంది. ఈ సినిమా దక్షిణ కొరియాకి చెందిన ‘వెట్రన్‌’కి రీమేక్‌.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.